పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా. ఉపాధ్యాయులు శుక్రవారం విద్యార్థులచే పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలన, దోమల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.