వైఎస్సార్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు

85చూసినవారు
వైఎస్సార్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు
ఏపీలో తాజాగా వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలు మండలం అద్దెపల్లి దళితవాడలో గల వైఎస్సార్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పింటించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది.ఈ ఘటనకు నిరసనగా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.

సంబంధిత పోస్ట్