చంచల్ గూడ జైలు నుంచి కాసేపటి క్రితం అల్లు అర్జున్ విడదలయ్యారు. ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌కు కుటుంబసభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు. ఇంటికి చేరుకున్న వెంటనే తన భార్య, కొడుకును చూసి ఐకాన్ స్టార్ భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం మాట్లాడుతూ తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని చట్టానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.