వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా వైవీ సుబ్బారెడ్డి

83చూసినవారు
AP: వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్య‌స‌భ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఎన్నుకుంటున్నట్లు వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. శుక్రవారం ఎంపీలతో జరిగిన సమావేశంలో జ‌గ‌న్ మాట్లాడుతూ.. "రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయి రెడ్డి కొనసాగుతారు. లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథున్‌రెడ్డి వ్యవహరిస్తారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారు." అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్