
టీమిండియా భారీ స్కోర్
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. యంగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్ 112 మరో సెంచరీతో మెరిశాడు. విరాట్ కోహ్లీ 52, శ్రేయాస్ అయ్యర్ 78, కేఎల్ రాహుల్ 40, హార్దిక్ పాండ్య 17, అక్షర్ పటేల్ 13, సుందర్ 14, హర్షిత్ రానా 13 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 1 మరోసారి నిరాశపరిచాడు.