ముంబై టార్గెట్ 158
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా భారీ స్కోరు సాధించింది. వర్షం కారణంగా ఆటను 16 ఓవర్లకు కుదించగా కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వెంకటేష్ 42, నితీశ్ 33, రింకూ 20, రస్సెల్ 24, రమణదీప్ సింగ్ 17 పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లు చావ్లా, బుమ్రా చెరొక రెండు వికెట్లు తీశారు. అన్షుల్ కాంబోజ్, నువాన్ తుషార చెరొక వికెట్ తీశారు. ముంబై టార్గెట్ 159 పరుగులు.