ఊరు విడిచి వెళ్తున్న తలారి చెరువు గ్రామస్తులు

85చూసినవారు
తాడిపత్రి మండలం తలారి చెరువు గ్రామ ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. బుధవారం మాఘమాసం పౌర్ణమి కావడంతో కట్టుబట్టలతో ఊరు విడిచి వెళ్లి, గ్రామానికి 5 కి.మీ. దూరంలో ఉన్న హాజీవలి దర్గాల్లో 24 గంటలు బస చేయనున్నారు. దీని వెనక ఓ కారణం ఉందంట. కొన్ని సంవత్సరాల క్రితం గ్రామంలో ఓ బ్రాహ్మణుడ్ని హత్య చేశారని, ఆ పాపం తమ వారసులకు తగలకూడదని చాలా ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారని గ్రామస్తులు వివరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్