మద్యం రేట్లు పెంపు.. మీకో న్యాయం మాకో న్యాయమా?: శ్రీనివాస్ గౌడ్

79చూసినవారు
తెలంగాణలో బీర్ల ధరలను కాంగ్రెస్ ప్రభుత్వం 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంపుపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మద్యం అమ్మితే రాద్దాంతం చేశారని అన్నారు. ఇప్పుడు ఒక్కో బీరుకు రూ. 30 నుంచి రూ. 40 కనీవినీ రీతిలో పెంచడం దేనికి సంకేతం అని మండిపడ్డారు. 'మేం ధరలు పెంచితే మందు అమ్మి ప్రభుత్వాన్ని నడుపుతున్నామని రాద్దాంతం చేశారు. మీకో న్యాయం మాకో న్యాయమా?' అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్