Top 10 viral news 🔥
రాష్ట్ర వార్తలు
పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన నలుగురు మహిళలు (వీడియో)
తెలంగాణలో నిజామాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. పేకాట ఆడుతూ పోలీసులకు నలుగురు మహిళలు చిక్కారు. పట్టణంలోని సరస్వతి నగర్ నీలోఫర్ ఆసుపత్రి నాలుగో అంతస్థులో డబ్బు పెట్టి పేకాట ఆడుతున్న నలుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల నుంచి రూ.15 వేల నగదుతో పాటు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మహిళలంతా ప్రముఖ వైద్యుల సతీమణులని సమాచారం. ఈ ఘటన సంబంధించిన వీడీయో వైరల్ అవుతోంది.