ఇజ్రాయెల్‌పై 50 రాకెట్లతో విరుచుకుపడిన హెజ్బొల్లా (వీడియో)
ఇజ్రాయెల్ సైనిక స్థావరలే లక్ష్యంగా హెజ్బొల్లా దాడులకు సిద్ధమైంది. తాజాగా హెజ్బొల్లా గ్రూప్ ఇజ్రాయెల్‌పై భారీగా రాకెట్ల దాడి చేసింది. బుధవారం ఉదయం ఉత్తర లెబనాన్ వైపు నుంచి సుమారు 50 రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి దూసుకోచ్చాయని ఐడీఎఫ్ తెలిపింది. వెంటనే అప్రత్తమైన ఇజ్రాయెల్ ఆర్మీ.. 50 ప్రొజెక్టైల్స్‌ను మధ్యలోనే అడ్డుకొని నేల కూల్చామని వెల్లడించింది. ఈ రాకెట్ల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఐడీఎఫ్ వెల్లడించింది.