న్యూస్ బులెటిన్ జూన్ 20: పట్టణ పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు మరిన్ని ముఖ్యాంశాలు

278చూసినవారు
లారీ బోల్తా

మండల కేంద్రంలోని సర్వీస్‌ రహదారిపై అదుపు తప్పి లారీ బోల్తాపడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలు కాగా, చికిత్స నిమిత్తం కోదాడలోని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. రహదారిపై వాహనం అడ్డంగా వుండటంతో ప్రయాణికులు, వాహనదారులు, గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు.

ప్రతి పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేయాలి

సూర్యాపేట జిల్లాల్లోని ప్రతి గ్రామ పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి హరితహారం ప్రత్యేక అధికారిణి ప్రియాంకవర్గీస్‌, ఇతర శాఖల అధికారులతో కలిసి నాలుగో విడత హరితహారంపై జిల్లాల కలెక్టరేట్లతో దూర దృశ్య మాధ్యమం ప్రసారం ద్వారా ఆయన సమీక్షించారు.

నకిలీల జోరు!

వ్యాపారులు గ్రామాల్లోకి వెళ్లి తక్కువ ధర, ఉద్దెరకు ఇస్తామని చెప్పడంతో అన్నదాతలు వీటినే కొని సాగు చేసినట్లు తెలిసింది. సాగు చేసి దాదాపు పక్షం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఈ ప్రాంతంలో చాలా వరకు మొలకలు కూడా రాలేదు.ఈ నెల 10న కనగల్‌ మండలంలో నకిలీ విత్తనాలు అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు వెళ్లగా వారు పత్తి ప్యాకెట్లను అక్కడే పడేసి వ్యాపారులు పరారయ్యారు.

పట్టణ పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు

జిల్లాలోని పట్టణ పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేయనున్నట్లు మెప్మా పథక సంచాలకుడు ఎన్‌.శంకర్‌ అన్నారు.ఆయన మాట్లాడుతూ జిల్లాలో పురపాలికలుగా ఉన్న సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌లతో పాటు నూతనంగా ఏర్పాటు కాబోతున్న నేరేడుచర్ల, తిరుమలగిరి పట్టణాలకూ మెప్మా కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్