ఆస్తి ఇవ్వలేదని అమ్మనే హతమార్చిన తనయుడు

58చూసినవారు
ఆస్తి ఇవ్వలేదని అమ్మనే హతమార్చిన తనయుడు
AP: ఆస్తి కోసం కుమారుడే కన్నతల్లిని హతమార్చాడు. విజయవాడ మధురానగర్‌‌లోని పప్పులమిల్లు కూడలికి చెందిన మూడు లక్ష్మి(62) ఈ నెల 26న అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె అంత్యక్రియలకు కొడుకు, కోడలు రాకపోవడంతో పోలీసులు నిఘా పెట్టారు. పెద్ద కొడుకు పెద్ద సాంబశివరావు తన భార్య వాణితో క్రిస్మస్‌కు తల్లి వద్దకు వచ్చారు. అప్పులున్నాయి.. ఆస్తిలో తన వాటా ఇస్తే తీర్చుకుంటానని అడిగాడు. దీనికి తల్లి ఒప్పుకోలేదు. నిద్రపోతున్న ఆమెను చంపి, నగలతో పారిపోయారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్