ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన మరణానికి నివాళిగా ఇరాక్‌లోని వంద మంది శిశువులకు నస్రల్లా పేరు పెట్టారు. ఈ మేరకు ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. లెబనాన్‌లోని బీరుట్‌లో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో నస్రల్లా మృతి చెందారు. హసన్ నస్రల్లా అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.