హైదరాబాద్ నగరం నకిలీ వైద్యులకు అడ్డాగా మారుతోంది. డబ్బు కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అర్హత లేకున్నా వైద్యం చేసి నకిలీ వైద్యులు రోగుల ప్రాణాలు తీస్తున్నారు. మహానగర వ్యాప్తంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో ఇప్పటివరకు 100 మంది నకిలీ వైద్యుల గుట్టు రట్టైంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో ఎలాంటి ఎంబీబీఎస్ ఇతర వైద్య పట్టాలు లేకుండానే ప్రాక్టీసు చేస్తున్నట్లు గుర్తించారు.