ఓ వ్యక్తి చేసిన మెసేజ్‌కు మంత్రి లోకేశ్ సకాలంలో స్పందించడంతో బ్రెయిన్‌డెడ్ మహిళ చెరుకూరి సుష్మ అవయవదానం చేయడంతో, తిరుపతిలో ఓ రోగికి ప్రాణదానం జరిగుతుందని రమేశ్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. గుండెను తరలించేందుకు లోకేశ్ సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి, గ్రీన్ ఛానెల్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. రాత్రి 7 గంటలకు గుండెను గుంటూరు రమేశ్ ఆసుపత్రికి తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు.