చెన్నైకి చెందిన 11 ఏళ్ల చిన్నారి మాయ నీలకంఠన్ తన గిటార్ కళా నైపుణ్యంతో
అమెరికా గాట్ టాలెంట్‌ని మెస్మరైజ్ చేసింది. మాయ ఇటీవల
అమెరికా గాట్ టాలెంట్ కోసం జరిగిన అడిషన్లో మొత్తం షో దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో పాపా రోచ్ లాస్ట్ రిసార్ట్ వేదికపై తన గిటార్ ప్రదర్శనతో ఆ షో జడ్జిలు సైమన్ కోవెల్, సోఫియా వెర్గారా, హెడీ క్లమ్, హౌవీ మాండెడ్ల మనసులను గెలుచుకుని ప్రశంసలందుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.