టాటా అంతర్జాతీయ విక్రయాల్లో 2% పెరుగుదల

59చూసినవారు
టాటా అంతర్జాతీయ విక్రయాల్లో 2% పెరుగుదల
టాటా మోటార్స్ అంతర్జాతీయ విక్రయాలు 2024 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 2% పెరిగి 3,29,847కు చేరాయి. 2023-24 ఇదే కాలంలో విక్రయాలు 3,22,159 నమోదయ్యాయి. ప్రయాణికుల వాహనాల అంతర్జాతీయ టోకు విక్రయాలు 1% తగ్గి 1,38,682కు పరిమితమయ్యాయి. జాగ్వార్, ల్యాండ్ రోవర్ సరఫరాలు 5% పెరిగి 97,755గా నమోదయ్యాయి. టాటా వాణిజ్యవాహనాలు, టాటా దేవూ శ్రేణి వాహనాల అంతర్జాతీయ టోకు విక్రయాలు 6% పెరిగి 93,410గా నమోదయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్