తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని పాఠశాలల్లో మెడిటేషన్ తరగతులు నిర్వహించనుంది. ఈ మేరకు తాజాగా ఆ సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి వెల్లడించారు. విద్యార్థుల్లో మానసిక ఆందోళన, ఒత్తిడిని తగ్గించి చదువుపై ఏకాగ్రతను పెంచేందుకు ఈ తరగతులు ఎంతో దోహదపడతాయని వివరించారు. ప్రతి గురుకులంలో ఐదో తరగతి నుంచి 12వ తరగతి
విద్యార్థులు ఈ తరగతులకు హాజరవుతారన్నారు.