అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్

68చూసినవారు
అగ్నివీరులకు పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్
అగ్నివీరులకు హర్యానా ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తమ రాష్ట్రంలో అగ్నివీరులకు పోలీసు నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నామని ప్రకటన చేసింది. సీఎం నాయబ్ సింగ్ సైనీ ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నివీరుల కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా హర్యానా నిలిచిందని సీఎం నాయబ్ సింగ్ సైనీ అన్నారు.

సంబంధిత పోస్ట్