తమ సముద్ర తీరంలో చేపల వేట సాగిస్తున్నారనే కారణంతో 22 మంది తమిళ మత్స్యకారులను శ్రీలంక నేవీ తాజాగా అరెస్ట్ చేసింది. ఒక బ్యాచ్‌లో 12 మంది, మరో బ్యాచ్‌లో 10 మందిని గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో శ్రీలంక నేవీ అదుపులోకి తీసుకుంది. దీనిపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. మత్స్యకార ప్రతినిధులతో కలిసి భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కలిశారు. సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.