ఈనెల 7, 8 తేదీల్లో సూర్యుడి నుంచి వెలువడిన 3 తీవ్ర స్థాయి సౌర తుఫాన్లు వచ్చే 2 రోజుల్లో భూమిని తాకొచ్చని సోలార్ అండ్ హీలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ తెలిపింది. అవి సెకనుకు వెయ్యి కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నాయని, ఉపగ్రహాలు, కమ్యూనికేషన్స్, పవర్ గ్రిడ్స్‌పై వీటి ప్రభావం ఉండొచ్చని చెప్పింది. వీటిలో మూడో తుఫాను కేటగిరీ-3 స్థాయిదని వివరించింది. సాంకేతిక మౌలిక వసతుల విషయంలో ముందుగా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది.