ఇండియన్ బ్యాంక్‌లో 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 2వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులై, 1-7-2024 నాటికి 20-30 ఏళ్ల వయసు ఉన్న వారు అర్హులు. ఆన్‌లైన్ టెస్టు, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం రూ. 48,480 -రూ. 85,920 మధ్య ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్: https://www.indianbank.in/ని సందర్శించండి.