తెలంగాణ ఆర్టీసీలో 3,038 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు సంస్థ వైస్ ఛైర్మన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందన్నారు. సోమవారం హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. "కొత్తగా భర్తీ చేయనున్న పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం. ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉంది. ఈ పోస్టుల భర్తీతో కార్మికులు, ఉద్యోగులపై పనిభారం తగ్గుతుంది." అని చెప్పారు.