TG: సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లతో తాగునీటి సమస్యలు, భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై చర్చించారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. ఎక్కడ లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులకు కలెక్టర్లు హాజరు కావాల్సిందేనని తెలిపారు. తాగునీటి సరఫరా విషయంలో జిల్లాల్లో వేసవి యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలన్నారు.