నువ్వు పక్కనుంటే బాగుంటాదే
నీ పక్కనుంటే బాగుంటాదే
నువ్వు కారమెట్టి పెట్టినా కమ్మగుంటాదే
కత్తి పెట్టి గుచ్చినా సమ్మగుంటాదే
అట్ట వచ్చి ఇట్ట నువ్వు తిప్పుకుంట
ఎళ్ళిపోతే ఎక్కడో కలుక్కుమంటాదే
ఎళ్ళిపోకె శ్యామలా ఎళ్ళమాకె శ్యామలా
నువ్వు వెళ్ళిపోతే అస్సలా
ఊపిరాడదంట లోపలా
ఎళ్ళిపోకె శ్యామలా
ఎక్కి ఎక్కి ఏడవ లేనే
ఎదవ మగ పుటక
గుండె బెరికినట్టుందే నువ్వే ఎళ్ళినాక
ఎళ్ళిపోకె శ్యామలా హే ఎళ్ళమాకె శ్యామలా
నువ్వు వెళ్ళిపోతే అస్సలా
ఊపిరాడదంట లోపలా
ఎళ్ళిపోకె శ్యామలా
హ్మ్ నరం లేని నాలిక నిన్ను
ఎలిపోమ్మని పంపిందాయే
రథం లేని గుర్రం లాగ
బ్రతుకే చాతికిలపడిపోయే
నీ పోస్టరు అడ్డంగా చింపేసాననుకున్న
గుండెల్లో నీదే సినిమా ఆడుతున్నదే