లీటరు నీటిలో మూడు మిల్లీగ్రాముల కంటే తక్కువ బీవోడీ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) ఉంటే అది స్నానానికి యోగ్యమని ప్రమాణాలు చెబుతున్నాయి. సంగమ స్థలంలో అది 3.94 నుంచి 5.29 వరకు వేర్వేరు స్థాయిల్లో ఉన్నట్లు సీపీసీబీ వెల్లడించింది. జనవరి 12-13 తేదీల్లో బీవోడీ ఎక్కువగా ఉందని, తర్వాత మంచి నీటిని పైనుంచి విడుదల చేయడం వల్ల తగ్గిందని జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు సీపీసీబీ తెలిపింది.