జులై మాసంలో అమెరికాలో నిరుద్యోగం 4.3శాతానికి పెరిగింది. గత మాసంలో కేవలం 1,14,000 కొత్త ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. దీంతో లేబర్ మార్కెట్ మందకొడిగానే సాగనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయని అమెరికా లేబర్ విభాగం శుక్రవారం పేర్కొంది. ఆరోగ్య సంరక్షణ, నిర్మాణం, రవాణా, గోదాములు వంటి రంగాల్లో ఉపాధి పెరగగా, సమాచార పరిశ్రమలో ఉద్యోగాలు పోయాయని కార్మిక గణాంకాల బ్యూరో తెలిపింది.