మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో విష వాయువులు మిగిల్చిన విషాదానికి 40 ఏళ్లు అయ్యింది. భోపాల్‌లో అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి 1984 డిసెంబరు 2-3వ తేదీ రాత్రి మిథైల్ ఐసోసైనేట్ విషవాయువులు విడుదలయ్యాయి. వాటి కారణంగా అప్పట్లో 5,479 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 5 లక్షల మందికిపైగా ప్రభావితమయ్యారు. అనేక వ్యాధుల బారినపడిన బాధితులు.. దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు.