ఆ రంగంలో త్వరలో 5 కోట్ల ఉద్యోగాలు

72చూసినవారు
ఆ రంగంలో త్వరలో 5 కోట్ల ఉద్యోగాలు
హాస్పిటాలిటీ, టూరిజం రంగం రాబోవు 5-7 ఏళ్లలో 5 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని హోటల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (HAI) తెలిపింది. దీనికోసం ఈ రంగానికి పూర్తి పరిశ్రమ, మౌళిక రంగ హోదాను ఇవ్వాలని రాష్ట్రాలను కోరింది. దేశ అభివృద్ధిలో పర్యాటక రంగమూ కీలకమేనని HAI అధ్యక్షుడు పునీత్ అన్నారు. మొత్తం ఉపాధిలో 10 శాతం, జీడీపీలో 8 శాతం వాటాను ఈ రంగం అందిస్తోందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్