పారాసెటమాల్‌తో సహా 52 ఔషధ నమూనాలు నాణ్యత పరీక్షలో ఫెయిల్

78చూసినవారు
పారాసెటమాల్‌తో సహా 52 ఔషధ నమూనాలు నాణ్యత పరీక్షలో ఫెయిల్
భారతదేశంలో కొన్ని ఫార్మా సంస్థలు తయారు చేస్తున్న డ్రగ్స్.. నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. వీటిలో విస్తృతంగా ఉపయోగించే పారాసెటమాల్, పాంటోప్రజోల్ కూడా ఉన్నాయి. ఈ మందులతో పాటు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు వినియోగించే యాంటీబయాటిక్ లు కూడా క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయినట్లు సమాచారం. జూన్ 20న జారీ చేసిన డ్రగ్ అలర్ట్ ప్రకారం.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO) నాణ్యత పరీక్షల్లో మొత్తం 52 నమూనాలు విఫలమయ్యాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్