సంక్రాంతి రద్దీ కారణంగా.. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. అదనంగా మరో 52 రైళ్లు నడపనున్నట్లు రైల్వే వెల్లడించింది. నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. ఆయా ప్రాంతాలకు ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.