చలికాలంలో లవంగాలను తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. లవంగాలను తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నోటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియకు మేలు కలుగుతుంది. దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చర్మ వ్యాధులైన మొటిమలు, చుండ్రు వంటి సమస్యలు దరిచేరవు.