ప్రేమ పేరుతో కూతురికి వేధింపులు.. టెన్త్ విద్యార్థిపై కత్తితో దాడి చేసిన తండ్రి

80చూసినవారు
ప్రేమ పేరుతో కూతురికి వేధింపులు.. టెన్త్ విద్యార్థిపై కత్తితో దాడి చేసిన తండ్రి
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రభుత్వ బాలుర పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ బాలుడుకు ఎదురుగా ఉన్న పాఠశాల బాలికతో పరిచయం ఏర్పడింది. అయితే బాలికతో తరుచుగా బాలుడు మాట్లాడుతుండటంతో బాలిక తండ్రి సహించలేకపోయాడు. దీంతో బాలుడిపై బాలిక తండ్రి కత్తితో దాడి చేశాడు. గాయాలపాలైన బాలుడిని ముమ్మడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన కూతురును ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసినందుకే ఆ బాలుడిపై దాడి చేసినట్టు తండ్రి చెబుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్