గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ సూసైడ్

78231చూసినవారు
గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ సూసైడ్
ఏపీలోని విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్ రావు గన్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. శంకర్ రావు స్థానిక ఐవోబీ బ్యాంక్ లో గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయం 5 గంటలకు విధులకు హాజరై ఎస్ఎల్‌ఆర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ద్వారాకానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్