నిర్లక్ష్యంగా శస్త్రచికిత్స చేసి బాధితుడి కంటిచూపు కోల్పోవడానికి కారణమైన ఓ వైద్యశాలకు రూ.61.62 లక్షల జరిమానా విధిస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన చేవూరు సురేశ్‌బాబు 2017, మే 11న నెల్లూరులోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో కంటి వైద్యం చేయించుకున్నారు. అయితే.. 12న ఎడమ కంటి చూపు కోల్పోయాడు. దీంతో బాధితుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. ఆధారాలను పరిశీలించిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.