అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టు వద్ద ఓ విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 64 మంది ప్రయాణికులు మృతి చెందినట్టు అమెరికా ప్రకటించింది. మానవ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం అనంతరం విమాన శకలాలు పోటోమాక్ నదిలో పడిపోవడంతో మరణాల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. ఆ దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదం.