AP: కొడుకు మృతదేహాన్ని 70 కి.మీ. బస్సులో, బైక్‌పై తీసుకెళ్లిన ఘటన పార్వతీపురం జిల్లాలో చోటు చేసుకుంది. కురుపాం మండలం నీలకంఠాపురం గ్రామానికి చెందిన కొండగొర్రి అశోక్, స్వాతి దంపతుల కుమారుడు రోహిత్ (3) అనారోగ్యం బారిన పడ్డాడు. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కోసం ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. దాంతో బస్సులో 35 కి.మీ., బైక్‌పై 35 కి.మీ. ప్రయాణించి మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లారు.