తిరుమల శ్రీవారి సేవలో సింగర్ స్మిత

84చూసినవారు
AP: తిరుమల శ్రీవారిని సింగర్ స్మిత శుక్రవారం దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం  వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె తన కుమార్తెతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. తొలుత వారికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్