RBI కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఆహార ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగానే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. SDF రేటును 6.25 శాతం, MSF రేటును 7.25 శాతంగానే ఉంది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది 11వ సారి కావడం గమనార్హం.