తెలంగాణలో మూడు ఈఎస్ఐ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర సహాయమంత్రి శోభ కరంద్లజే వెల్లడించారు. రామగుండం, రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో 100 పడకలు, మహబూబ్ నగర్ లో 100 పడకలకు ఆస్పత్రులను అప్ గ్రేడ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఏడు ఆస్పత్రులు ఉన్నాయని, వాటిలో రెండు ESI కార్పొరేషన్, మిగతావి తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయన్నారు.