AP: ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉద్యోగార్థులు నుంచి డబ్బులు తీసుకొని వారిని దారుణంగా హింసిస్తున్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్, అధ్యక్షుడు అయిన బసవ రమణ అనే వ్యక్తి ఇలా యువకులను శారీరకంగా హింసిస్తున్నాడు. ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విద్యార్థుల దగ్గర రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.