అవమానంతో 8వ తరగతి బాలిక ఆత్మహత్య

83చూసినవారు
ఫీజు విషయంలో టీచర్ అవమానించారని 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, స్కూల్ ఫీజు చెల్లించకపోవడంతో బాలికను ఇంటర్నల్ పరీక్షలు రాయనీయలేదని తెలిపారు. ఈ క్రమంలో బాలికను క్లాస్ రూం బయట నిలబెట్టారు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్