AP: అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలిక హత్య కేసులో నిందితుడు శుభాచారి శేఖర్ (31)కి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 2015లో దేవరాపల్లికి చెందిన ఏడేళ్ల బాలికను శుభాచారి శేఖర్ బీరు బాటిల్‌తో గొంతు కోసి దారుణంగా చంపేశాడు. ఈ మేరకు చోడవరం 9వ అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్ తీర్పు వెలివరించారు. అయితే చోడవరం కోర్టు చరిత్రలో ఉరిశిక్ష విధించడం ఇదే తొలిసారి.