ప్రపంచంలోనే అతి పొడవైన నాలుక కలిగిన మహిళగా అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన చానెల్ ఎల్ టాపర్ అనే మహిళ గిన్నిస్ రికార్డు సృష్టించింది. చానెల్ ఎల్ టాపర్ నాలుక 9.75 సెంటీమీటర్లు (3.8 అంగుళాలు) పొడవులో, ఐఫోన్ పరిమాణంలో ఉంది. ‘నా పొడవైన నాలుక చూసి ప్రజలు షాక్ అయినా, భయపడినా అది నాకు చాలా ఇష్టం’ అని ఆ మహిళ చెప్పారు.