భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు

80చూసినవారు
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు
2025-26 కొత్త ఆర్ఠిక సంవత్సరం తొలి రోజున దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. మంగళవారం ఉదయం స్వల్ప నష్టాలతో  స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. టారిఫ్‌ల భయాలతో  స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌ 1390 పాయింట్ల నష్టంతో 76,024 వద్ద ముగిసింది. నిఫ్టీ 354 పాయింట్ల నష్టంతో 23,165 వద్ద ముగిసింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, జొమాటో మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి.

సంబంధిత పోస్ట్