భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్‌ఫర్మాటిక్స్ (BISAG-N) 299 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆయా పోస్టులకు అవసరమైన విద్యార్హతలు, అనుభవంతో, 40 ఏళ్ల లోపు వయసున్నవారు దరఖాస్తుకు అర్హులు. ఏప్రిల్ 16లోగా ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది.