తొలి రోజే 90 శాతం పింఛన్లు పంపిణీ చేయాలి: ఏపీ సీఎస్‌

80చూసినవారు
తొలి రోజే 90 శాతం పింఛన్లు పంపిణీ చేయాలి: ఏపీ సీఎస్‌
ఏపీలో జులై ఒకటో తేదీ నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభం కానున్నట్టు సీఎస్‌ నీరభ్‌కుమార్‌ తెలిపారు. తొలి రోజే 90 శాతం పింఛన్లు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జులై 1న 65,18,496 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేయాలని సూచించారు. ఇందుకోసం రూ.4,399.89 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్