పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్.. రూ.4,400 కోట్ల నిధులు విడుదల

59చూసినవారు
పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్.. రూ.4,400 కోట్ల నిధులు విడుదల
పింఛన్‌దారులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కింద రూ.4,400 కోట్ల నిధులను శనివారం విడుదల చేసింది. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జులై 1వ తేదీన 65.18 లక్షల మంది లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్