కొత్త క్రిమినల్‌ చట్టాల అమలుపై పీయూసీఎల్‌ లేఖ

53చూసినవారు
కొత్త క్రిమినల్‌ చట్టాల అమలుపై పీయూసీఎల్‌ లేఖ
కేంద్రం తీసుకువచ్చిన క్రిమినల్‌ చట్టాలు జూలై ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. కేంద్రం నిర్ణయంతో ఇండియన్ పీనల్ కోడ్ (IPS), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (CrPC), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష (BNSS), భారతీయ సాక్ష్య అధినియమ్ (BSA) అమలులోకి రాబోతున్నాయి. అయితే, ఈ కొత్త చట్టాల అమలును వాయిదా వేయాలని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (PUCL) కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు శనివారం లేఖ రాసింది.

సంబంధిత పోస్ట్