AP: వంగవీటి రాధాకు ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రిగా చేస్తారని అప్పట్లో వినిపించిన మాట. కానీ ఆ ఖాళీ నాగబాబుతో భర్తీ చేస్తున్నారు. దీంతో వంగవీటి అనుచరులలో కలవరం రేగుతోంది. ఈ నేపథ్యంలో వంగవీటికి బాబు మంచి హామీనే ఇచ్చారనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. వచ్చే మార్చి నెలలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లలో ఒక దానిని కచ్చితంగా ఇచ్చి శాసనమండలికి నామినేట్ చేస్తామని బాబు హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.